74 | Devuni Sthuthinchudi | దేవుని స్తుతియించుడి | Calvary Temple

పల్లవి: దేవుని స్తుతియించుడి 
ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడీ ఆ... ఆ... ॥దేవుని॥

1. ఆయన పరిశుద్ధ ఆలయమందు - ఆయన సన్నిధిలో 
ఆ... ఆ... ఆయన సన్నిధిలో - ఎల్లప్పుడు ॥దేవుని॥

2. ఆయన బలమును ప్రసిద్ధిచేయు - ఆకాశ విశాలమందు 
ఆ... ఆ... ఆకాశవిశాలమందు ఎల్లప్పుడు ॥దేవుని॥

3. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన ప్రభావమును 
ఆ... ఆ... ఆయన ప్రభావమును ఎల్లప్పుడు ॥దేవుని॥

4. బూరధ్వనితో ఆయనన్ స్తుతియించుడి - స్వరమండలములతో 
ఆ... ఆ... స్వరమండలములతో - ఎల్లప్పుడు॥దేవుని॥

5. సన్న తంతుల సితారతోను - చక్కని స్వరములతో 
ఆ... ఆ... చక్కని స్వరములతో ఎల్లప్పుడు॥దేవుని॥

6. తంబురతోను నాట్యముతోను తంతివాద్యములతో 
ఆ... ఆ... తంతి వాద్యములతో ఎల్లప్పుడు ॥దేవుని॥

7. మ్రోగు తాళములతో ఆయనన్ స్తుతించుడి - గంభీర తాళముతో 
ఆ...ఆ... గంభీర తాళముతో ఎల్లప్పుడు ॥దేవుని॥

8. సకలప్రాణులు - యెహోవాను స్తుతించుడి 
హల్లెలూయా ఆమేన్ ఆ...ఆ... 
హల్లెలూయా ఆమేన్ ఎల్లప్పుడు ॥దేవుని॥

Post a Comment

0 Comments