పల్లవి: మాయలోకం మాయలోకం - తెలుసుకో ఇది మాయలోకం
ప్రేమలోకం ప్రేమలోకం - ప్రేమకర్ధం తెలియని లోకం
తెలుసుకో ఇది యౌవన మైకం - కొంపముంచును నీ అమాయకం
1. ఎవడో నవ్వాడని - అదియే ఆ ప్రేమయని
అందంగా వున్నాడని - అన్నీ తెలిసిన వాడని
మాటల మాయలో మలినమై పాటల పార్కులో పతనమై ॥2॥
నీ బ్రతుకు నాశనం చేసుకొందువా ఓ చెల్లెమ్మా... ॥మాయ॥
2. ఎక్కడో అమ్మాయిని చూసి - అక్కడే తన మనసిచ్చేసి
అప్పుడే దేవుని మరచి - అక్కడే పిలుపును విడిచి
ప్రేమ ముసుగులో అంధుడై - కామ క్రియలలో బంధియై ॥2॥
ఆ సమ్సోనులా చంపుకొందువా ఓ సోదరుడా... ॥మాయ॥

0 Comments