03 | Nee Prema Nee Karuna Chalunaya Naa Jeevithaniki | నీ ప్రేమా నీ కరుణా చాలునయా నా జీవితానా | Calvary Temple

పల్లవి: నీ ప్రేమా..... నీ కరుణా..... చాలునయా నా జీవితానా 
మరి దేనినీ ఆశించనూ నే కోరను ఈ జగానా

అ.ప. చాలయ్య చాలు దీవెనలు చాలు 
మేలయ్య మేలు నీ సన్నిధి మేలు ॥2॥

1. గురిలేని నన్ను గుర్తించినావే 
ఎనలేని ప్రేమను చూపించినావే 
వెలలేని నాకు విలువిచ్చినావే 
విలువైన పాత్రగా నను మార్చినావే ॥నీ ప్రేమా॥

2. చేజారిన నాకై చేజాచినావే 
చెదరిన నా బ్రతుకును చేరదీసినావే 
చెరనుండి నన్ను విడిపించినావే 
చెరగని నీ ప్రేమకు సాక్షిగా మార్చావే ॥నీ ప్రేమా॥

3. నరకపు పొలిమేరలో నను కనుగొన్నావే 
కల్వరిలో ప్రాణమిచ్చి ననుకొన్నావే 
నీప్రేమను ప్రకటింప నను ఎన్నుకొన్నావే 
నీ కుమారునిగా నను మార్చినావే  ॥నీ ప్రేమా॥

Post a Comment

0 Comments