228 Jeevapradhaathavu / జీవప్రదాతవు ననురూపించిన / Hosanna Ministeries Songs


పల్లవి : జీవప్రదాతవు ననురూపించిన శిల్పివి నీవేప్రభు 
జీవనయాత్రలో అండగానిలిచే తండ్రివి నీవేప్రభు
జగములనేలే మహిమాన్వితుడా నాయెడ నీకృపను 
జాలిహృదయుడా నాపై చూపిన వీడని నీప్రేమను 
ఏమనిపాడెదనూ ఏమని పొగడెదను

1. శుభకరమైన తొలిప్రేమనునే 
మరువకజీవింప కృపనీయ్యవా 
కోవెలలోని కానుకనేనై 
కోరికలోని వేడుక నీవై 
జతకలిసినిలిచి జీవింపదలచి 
కార్చితివి నీరుధిరమే 
నీత్యాగ ఫలితం నీప్రేమ మధురం 
నా సొంతమే యేసయ్యా !! జీవప్రదాతవు !!

2. నేనేమైయున్న నీకృపకాదా 
నాతోనీసన్నిధిని పంపవా 
ప్రతికూలతలు శృతిమించినను 
సంధ్యాకాంతులు నిదురించినను 
తొలివెలుగు నీవై ఉదయించినాపై 
నడిపించినది నీవయ్యా 
నీ కృపకునన్ను పాత్రునిగాచేసి 
బలపరచిన యేసయ్యా !! జీవప్రదాతవు !!

3. మహిమనుధరించిన యోధులతోకలసి
 దిగివచ్చెదవు నాకోసమే 
వేల్పులలోన బహుఘనుడవు నీవు 
విజయవిహారుల ఆరాధ్యుడవు 
విజయోత్సవముతో ఆరాధించెదను 
అభిషక్తుడవు నీవని 
ఏనాడూపొందని ఆత్మాభిషేకముతో 
నింపుము నాయేసయ్యా !! జీవప్రదాతవు

Post a Comment

0 Comments