పల్లవి : ప్రేమాంబుధి కృపానిధీ నడిపించుసారధి
నీ ప్రేమయే నా ధ్యానము
నీ స్నేహమే నా ప్రాణము
నీవే నా గానము
1.ఎదుట నిలిచి నీవు ఉంటె భయములేదిక
ఎండమావి నీరు చూచి మోసపోనిక
సాగిపోయే నీడచూచి కలత చెందక
నీకై జీవించెద
|| ప్రేమాంబుధి ||
2.సంద్రమందు అలలవలె అలసిపోనిక
ధరణిలోని చూచి ఆశచెందక
భారమైన జీవితాన్ని సేదదీర్చిన
నీ ప్రేమ పొందెద
|| ప్రేమాంబుధి ||
0 Comments