ప్రార్ధన వలనే పయనము - ప్రార్ధనే ప్రాకారము
ప్రార్ధనే ప్రాధాన్యము - ప్రార్ధన లేనిదే పరాజయం (2)
ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా - ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా (2)
నీ పాదాలు తడపకుండా - నా పయనం
సాగదయ్యా (2) || ప్రార్ధన వలనే ||
1. ప్రార్ధనలో నాటునది పెల్లగించుట అసాద్యము
ప్రార్ధనలో పోరాడునది పొందకపోవుట
అసాద్యము (2)
ప్రార్ధనలో ప్రాకులాడినది పతనమవ్వుట అసాద్యము (2)
ప్రార్ధనలో పదునైనది పనిచెయ్యకపోవుట
అసాద్యము (2) || ప్రభువా ప్రార్ధన ||
2. ప్రార్ధనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాధ్యము
ప్రార్ధనలో మూలుగునది మరుగైపోవుట అసాద్యము (2)
ప్రార్ధనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము (2)
ప్రార్ధనలో పెనుగులాడితే పడిపోవుట అసాద్యము (2) || ప్రభువా ప్రార్ధన ||
0 Comments