161 | Ashesha Prajalunna | అశేష ప్రజలున్న| Athmiya Geethalu

ప: అశేష ప్రజలున్న ఈ అనంతలోకంలో.. 
యేసుకోసం శ్రమపడే యువకుడు కావాలి 
ప్రభు యేసుకోసం పనిచేసే యువతలు కావాలి
చిరుప్రాయంలో - యౌవ్వన కాలంలో 
యేసుకోసం శ్రమపడే యువకులు కావాలి
ప్రభు యేసుకోసం పనిచేసే యువతులు రావాలి

1. ఈ లోకం దాని ఆశలు గతించున్ - ఒక క్షణంలో 
లోకాన్ని ఆశించి ప్రభువును విడచి ఉన్మాదులవుతున్న 
ఉజ్జీవంతో - పట్టుదలతో
దేశం కోసం పోరాడే యువకులు రావాలి
మన దేశం కోసం పోరాడే యువతులు రావాలి

2.నిత్యజీవం పరవశం - నమ్మకత్వం, ఆనందం
యేసులోనే ఉన్నవని క్రీస్తులోనే సాధ్యమని లోకానికి చాటించుటకు 
విశ్వాసంతో పవిత్రతతో
సత్యం కోసం పోరాడే యోధులు కావాలి 
సత్యం కోసం పోరాడే యోధులు రావాలి

Post a Comment

0 Comments