143 Sagipodhunu Na Viswasamunaku|సాగిపోదును నా విశ్వాసమునకు|Song Lyrics

పల్లవి : సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో 
సుళువుగా చిక్కులు పెట్టే పాపములు విడిచి 
సాగిపోదును నా యేసయ్యతో

1.ఆత్మీయ బలమును పొందుకొని 
లౌకిక శక్తుల నెదురింతును - ఇంకా 
దేవుని శక్తిసంపన్నతతో ప్రకారములను దాటెదను 
నిశ్చయముగా శత్రుకోటలు నేను జయించెదను ॥ సాగిపోదును ||

2. నూతనమైన మార్గములో 
తొట్రిల్లకుండ నడిపించును - నవ 
దేవుని కరుణాహస్తము నాచేయి పట్టుకొని 
నిశ్చయముగా మహిమలోనికి నన్ను చేర్చునే ॥ సాగిపోదును ॥

3.శ్రేష్ఠమైన బహుమానముకై
సమర్పణ కలిగి జీవింతును - మరి 
దేవుని సన్నిధిప్రభావము నాపై ప్రసరించెను 
నిశ్చయముగా మరి శ్రేష్ఠమైన సీయోనులో నిలుపును ॥ సాగిపోదును ||

Post a Comment

0 Comments