139సీయోను రారాజు|Seyonu Raraju|Song Lyrics

పల్లవి : సీయోను రారాజు తన స్వాస్థ్యము కొరకై 
రానై యుండగా త్వరగా రానై యుండగా 
సంపూర్ణ సిద్ధి నొంద స్థిరపడెదము సంఘసహవాసములో ప్రేమసామ్రాజ్యములో

1. వివేచించుమా భ్రమపరచు ప్రతి ఆత్మను
ఏర్పరచబడినవారే తొట్రిల్లుచున్న కాలమిదే
వీరవిజయముతో నడిపించుచున్న పరిశుద్ధాత్మునికే విధేయులమై నిలిచియుందుము || సీయోను ||

2. అధైర్యపడకు వదంతులెన్నో విన్నాను ఆత్మభిషేకము కలిగి కృపలో నిలిచే కాలమిదే నిత్యమహిమకు అలంకరించు పరిశుద్ధాత్మునిలో నిరంతరము ఆనందించెదము ॥ సీయోను ॥

3.ఆశ్చర్యపడకు ఆకాశశక్తులు కదలినను 
దైవ కుమారులందరు ప్రత్యక్షమయ్యె కాలమిదే 
ఆర్భాటముగా రారాజు యేసు దిగివచ్చే వేళ 
రూపంతరము మనము పొందెదము ॥ సీయోను ||

Post a Comment

0 Comments