నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం
నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను
1.నీ దయ నుండి దూరము కాగా
ప్రేమతో పిలిచి పలుకరించితివే
కృపయే నాకు ప్రాకారము గల - ఆశ్రయపురమాయెను
నీ కృప వీడి క్షణమైనా నేనెలా మనగలను
॥ నా జీవితాన ||
2.నా యేసయ్యా - నీ నామమెంతో
ఘనమైనది - కొనియాడదగినది
కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను
నీ మహదైశ్వర్యము ఎన్నటికి తరగనిది
|| నా జీవితాన ||
3.నీ సన్నిధిని నివసించు నాకు
ఏ అపాయము దరిచేరనివ్వవు
కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను
నీ ఔన్నత్యమును తలంచుచూ స్తుతించెదను
॥ నా జీవితాన ||
0 Comments