96.Vinaledha Neevu|వినలేదా నీవు గెత్సేమనెలో|Song Lyrics in Telugu|Hosanna Ministries

పల్లవి : వినలేదా నీవు గెత్సేమనెలో 
వ్యాకుల రోదనను 
ప్రాణనాధుడు పాపులాకై
విజ్ఞాపన చేయుచుండె

1.భరింపజాలని భారము వలన 
దేహము కృశించి క్షీణించెనుగా 
దాహము సహించి తండ్రి సన్నిధిలో 
బాధతో విలపించెగా || వినలేదా ||

2.వచ్చితినే నీ చిత్తము చేయ 
ఇచ్చెదను నేను నా శరీరం 
నీ చిత్తమే సిద్ధించునుగాకని 
పలుకుచు ప్రార్థించెను || వినలేదా ||

3.తొలగించు మీ గిన్నె నీ చిత్తమైతే 
తనయుడు తండ్రిని వేడిన వేళలో 
స్వేద బిందువులు రక్తమై మారి 
నేలను కారెనుగా || వినలేదా ||

Post a Comment

0 Comments