Shiramu Meeda Mulla Sakshiga Song Lyrics
శిరము మీద ముళ్ళ సాక్షిగా -
కార్చిన కన్నీళ్ళ సాక్షిగా ||2||
పొందిన గాయాల సాక్షిగా -
చిందిన రుధిరంబు సాక్షిగా ||2||
యేసు నిన్ను పిలచుచున్నాడు -
నీ కొరకే నిలచియున్నాడు ||3||
1. సర్వపాప పరిహారం కోసం -
రక్తప్రోక్షణం ఆవశ్యమని
మనుషులలో ఎవ్వరూ బలికి పనికి రారని
పరమాత్ముడే బలియై తిరిగిలేవాలని
ఆర్యఋషులు పలికిన... ఆ ఆ ఆ వేదసత్యము
క్రీస్తులోనే నెరవేరెనుగా
శ్లోకం : సర్వపాప పరిహరో రక్తప్రోక్షణమవశ్యం
తద్రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం
ఆర్యఋషులు పలికినా వేద సత్యం
యేసులోనే నెరవేరెనుగా యేసే బలియైన పరమాత్మ ||శిరము||
2 మహా దేవుడే యిలకేతెంచి
యజ్ఞపశువుగా వాద పొందాలని
కళ్ళలోన చేతులలో మూడు మేకులుండాలని
శిరము పైన ఏడుముళ్ళ గాయాలు పొందాలని
బ్రాహ్మణాలు పలికిన... ఆఆఆ వేదసత్యం క్రీస్తులో నెరవేరెనుగా ...
శ్లోకం : చత్వార శృంగత్రయో అస్యపాదాద్వే
శీర్ష సప్త హస్తాసో త్రిధాబదో వృషభో రవిత్ మహాదేవో మర్త్యం అవివేశ :
బ్రాహ్మణాలు పలికిన వేదోక్తి -
క్రీస్తులో నెరవేరెనుగా క్రీస్తే మరణించి లేచిన యజ్ఞ పురుషుడగా ||శిరము||
0 Comments