63.Siluvalo Vrelade|సిలువలో - వ్రేలాడే|Song Lyrics in Telugu|Hosanna Ministries|Old Songs

పల్లవి : సిలువలో - వ్రేలాడే నీ కొరకే 
యేసు నిన్ను- పిలుచుచుండె - ఆలస్యము నీవు చేయకుము

1.కల్వరి శ్రమలన్ని నీ కొరకే - ఘోర సిలువ మోసే
క్రుంగుచునే
గాయములాచే భాధనొంది - రక్తము కార్చి హింస నొంది
||సిలువలో||

2.నాలుక యెండెను దప్పిగొని - కేకలు వేసెను
దాహమని
చేదు రసమును పానము చేసి- చేసెను
జీవయాగమును
||సిలువలో||

3.అఘాద సముద్ర జలములైనా- ఈ ప్రేమను
 ఆర్పజాలవుగా 
ఈ ప్రేమ నీకై విలపించుచూ - ప్రాణము ధార
బోయుచునే ||సిలువలో||

Post a Comment

0 Comments