57.Seyonulo Na Yesutho|సీయోనులో - నా యేసుతో|Song Lyrics in Telugu|Hosanna Ministries|Old Songs

పల్లవి : సీయోనులో - నా యేసుతో 
సింహాసనం యెదుట - క్రొత్తపాట పాడెద 
ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు

1.సీయోను మూల రాయిగా - నా యేసు నిలిచి యుండగా
ఆత్మసంబంధమైన మందిరముగా
కట్టబడుచున్నాను - యేసుపై
॥ సీయోను ॥

2.సీయోను కట్టి మహిమతో - నా యేసు రానై యుండగా
పరిపూర్ణమైన పరిశుద్ధతతో 
అతి త్వరలో ఎదుర్కొందును - నా యేసుని 
॥ సీయోను ॥

Post a Comment

0 Comments