Advertisement

Responsive Advertisement

79 | Seyonu Patalu | సీయోను పాటలు | Calvary Temple

పల్లవి: సీయోను పాటలు - సంతోషముగ 
పాడుచు సీయోను - వెళ్ళుదము

1. లోకాన శాశ్వతానందమేమియు - లేదని చెప్పెను ప్రియుడేసు 
పొందవలె నీ లోకమునందు - కొంతకాలమెన్నో శ్రమలు ॥సీ॥

2. ఐగుప్తును విడిచినట్టి మీరు - అరణ్యవాసులె యీధరలో 
నిత్యనివాసము లేదిలలోన - నేత్రాలు కానానుపై నిల్పుడి ॥సీ॥

3. మారాను పోలిన చేదైన స్థలముల - ద్వారా పోవలసియున్ననేమి 
నీరక్షకుండగు యేసే నడుపును - మారని తనదు మాటనమ్ము॥సీ॥

4. ఐగుప్తు ఆశలన్నియు విడిచి - రంగుగ యేసుని వెంబడించి 
పాడైన కోరహు పాపంబు మాని విధేయులై విరాజిల్లుడి॥ సీ॥

5. ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునేను 
సీయోను గీతము సొంపుగ కలిసి 
పాడెదము ప్రభుయేసుకు జై ॥సీ॥

Post a Comment

0 Comments