Advertisement

Responsive Advertisement

78 | Nee Padham Mrokkedan | నీ పాదం మ్రొక్కెదన్ | Calvary Temple

పల్లవి: నీ పాదం మ్రొక్కెదన్ - నిత్యము స్తుతించి 
నిన్నుపాడి కీర్తించెదను యేసయ్య - నీ ప్రేమ పొంగుచున్నది (2)

1. పరిశుద్ధమైన పరవశమే - పరమ యేసుని కృపావరమే 
వెదకి నన్ను కనుగొంటివి పాడుటకు పాట నిచ్చితివి ॥నీ॥

2. నూతన నూనె ప్రభావముతో నూతన కవిత్వపు కృపతోను
నింపి నిత్యము నడిపితివి  నూతన షాలేము చేర్చెదవు ॥నీ॥

3. ఇరుకు నందు పిలచితివి నాకు సహాయము చేసితివి 
చెడి ఎక్కడ తిరుగకుండ - చేరవచ్చి నన్ను ఆదుకొంటివి॥నీ॥

4. నిత్యముగ నీ సన్నిధి- నాకు ఇచ్చును విశ్రాంతిని 
దుడ్డుకఱ్ఱ నీ దండమును - నిజముగ నన్ను ఆదరించును॥నీ॥

5. ఫలించు చెట్టు నీవు నిలచు తీగగ నేను వ్యాపించుటకై 
కొమ్మ నరికి కలుపుతీసి - కాపాడి శుద్ధీకరించితివి ॥నీ॥

6. పరిశుద్ధమైన కీర్తితోను - ప్రకాశమైన శిఖరముపై 
శీఘ్రముగ చేర్చెదవు - సీయోనులో నిన్ను కీర్తించెదన్ ॥నీ॥

Post a Comment

0 Comments