పల్లవి: నా ప్రాణమా నా సర్వమా - ఆయన పరిశుద్ధ నామమునకు
సదా స్తుతులను చెల్లించుమా మరువకు ఆయన మేలులను
1. క్షమించును నీ పాపములను కుదుర్చును నీ రోగములను
కీడు నుండి నీ ప్రాణమును రక్షించి
కరుణా కిరీటము దయచేయును ॥నా ప్రాణమా॥
2. పడమటికి తూర్పెంత దూరమో - పాపలన్నియు దూరపరచెను
తండ్రి తన తనయులపై జాలిపడునట్లు
భక్తుల యెడల జాలిపడును ॥నా ప్రాణమా॥
3. నిన్ను మేలులతో తృప్తిపరచున్ - నీ యౌవనము నూతన పరచును
బాధితులకు బహున్యాయము తీర్చున్
యెహోవా యెంతో దయాళుడు ॥నా ప్రాణమా॥
4. మనము నిర్మింపబడినరీతి - మంటివారమని ప్రభు వెరుగును
గడ్డిపువ్వు వలె నున్నది మన బ్రతుకు
గాలి వీచగ అది యెగిరిపోవున ॥నా ప్రాణమా॥
5. స్థిరపరచె తన సింహాసనం - సర్వలోకమును యేలుచుండె
నీ యజ్ఞలను పాటించెదము
నా ప్రాణమా ప్రభున్ స్తుతించుమా ॥నా ప్రాణమా॥

0 Comments