Advertisement

Responsive Advertisement

38 | Randi Yuthsahinchi Paadudi | రండి యుత్సాహించి పాడుదము | Calvary Temple

పల్లవి: రండి యుత్సాహించి పాడుదము 
రక్షణ దుర్గము మన ప్రభువే

1. రండి కృతజ్ఞత స్తోత్రముతో - 
రారాజు సన్నిధి కేగుదము 
సత్ప్రభు నామము కీర్తనలన్- 
సంతోషగానము చేయుదము

2. మన ప్రభువే మహా దేవుండు- 
ఘన మహాత్మ్యము గలరాజు 
భూమ్యాగాధపు లోయలును - 
భూధర శిఖరము లాయనవే

3. సముద్రము సృష్టించె నాయనదే - 
సత్యుని హస్తమే భువి జేసెన్ 
ఆయన దైవము పాలితుల -
మాయన మేపెడి గొర్రెలము

4. ఆ ప్రభు సన్నిధి మోకరించి - 
ఆయన ముందర మ్రొక్కుదము 
ఆయన మాటలు గైకొనిన -
నయ్యవి మనకెంతో మేలగును

5. తండ్రి కుమార శుద్ధాత్మకునూ - 
దగు స్తుతి మహిమలు కల్గు గాక! 
ఆదిని నిప్పుడు నెల్లపుడు- 
నయినట్లు యుగముల నౌను ఆమేన్

Post a Comment

0 Comments