పల్లవి: నజరేతువాడా యూదులరాజా -
ఇమ్మానుయేల్ ప్రభు నీకే స్తోత్రం
అబ్రాహాము దేవా ఇస్సాకు దేవా-
యాకోబు దేవా నీకే స్తోత్రం
1. పాపము చేసిన నరునికి రక్షణ కోసం పరమును వీడి
మరియ తనయుడిగ పశుల పాకలో బాలుడు యేసుగ పుట్టి
సిలువను భుజమున మోసియు
మరణముపై విజయము ప్రకటించి
యేసునీ... ప్రేమా - యేసు నీ... కరుణా
యేసు నీ... త్యాగం - యేసు ఈ... మహిమా
నీకే... నీకే... నీకే చెల్లును
ఆ... హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)
2. ఎన్నో సూచక క్రియలు మాకై చేసి శిష్యులను పిలచి
సర్వ సత్యములో నడుపగ నీ ఆత్మ మాపై పంపి
రెండో రాకలో నమ్మిన వారల నెత్తబడే ఆకర్షణలో
యేసు నీ... ప్రేమా - యేసు నీ... కరుణా
యేసు నీ... త్యాగం - యేసు ఈ... మహిమా
నీకే... నీకే... నీకే చెల్లును
ఆ... హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

0 Comments