185 Sajeevudavina Yesayya / సజీవుడవైన యేసయ్యా / Hosanna Ministries Songs


పల్లవి : సజీవుడవైన యేసయ్యా
నిన్నాశ్రయించిన నీ వారికి
 సహాయుడవై తృప్తి పరచితివే 
సముద్రమంత సమృద్ధితో (2)
ఆనందించెద నీలో – అనుదినము కృప పొంది
 ఆరాధించెద నిన్నే – ఆనంద ధ్వనులతో (2)

1.ధన రాసులే ఇలా - ధనవంతులకు – ఈ లోక
భాగ్యము
దాచిన మేలులెన్నో – దయచేసినావే – ఇహ
 పరమున నాకు (2)
శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివి
 శ్రేష్టమైన నీ వాగ్ధానములతో (2)

1.ధన రాసులే ఇలా - ధనవంతులకు – ఈ లోక
భాగ్యము
దాచిన మేలులెన్నో – దయచేసినావే – ఇహ
 పరమున నాకు (2)
శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివి
 శ్రేష్టమైన నీ వాగ్దానములతో (2)
 ||సజీవుడవైన||

2.క్షేమము నొందుటయే – సర్వ జనులకు
ప్రయాసగా మారే
క్షేమాధారము నీవై - దీర్ఘాయువుతో - సంతృప్తి
పరతువు నన్ను (2)
నడిపించుచున్నది నీవే (2)
పరమ రాజ్యములో మహిమతో నింపుటకు
 అనుగ్రహించితివే 
పరిపూర్ణమైన నీ ఉపదేశమును (2)
 ||సజీవుడవైన||

Post a Comment

0 Comments