మహదానందమే తనతో జీవితం
ఓ మనసా ఇది నీకు తెలుసా!
1.దివ్యమైన సంగతులెన్నో నీ ప్రియుడు వివరించగా
ఉత్సాహ ధ్వనులతో వూరేగితివే
ఉరుముల ధ్వనులన్నీ క్షణికమైనవేగా
దిగులు చెందకే ఓ మనసా ॥మనసా||
2.ఆశ్చర్య కార్యములెన్నో నీ ప్రియుడు చేసియుండగా
సంఘము ఎదుట నీవు సాక్షివైతివే
ఇహలోక శ్రమలన్ని స్వల్పమేగా
కలవరమేలనే ఓ మనసా ॥మనసా||
3. నిష్కళంకరాలవు నీవని నీ ప్రియుడు నిను మెచ్చెనే
కృపాతిశయముచే నీవు ఉల్లసించితివే
దుష్టుల క్షేమము నీ కంట బడగా
మత్సరపడకే ఓ మనసా ॥మనసా||
0 Comments