పరిశుద్ధ గ్రంథము చేతపట్టి
దీక్షతో నడుము కట్టి - ఇంటింటి తలుపుట్టి ||2||యేసయ్య ఊసేచెప్పమ్మా - ఉరకనే ఉంటే తప్పమ్మా ॥2|| ॥ముసలమ్మ॥
1. ఆ ఇంటి సంగతులన్ని - ఈ ఇంటికి మోసేవమ్మా పొరుగింటి విషయాలన్ని - చాటింపు వేసేవమ్మా ॥2॥ ఇక్కడి మాటలు అక్కడ చెప్పి -
మంచిని చెడుగా తిప్పి ॥2॥
రెచ్చగొట్టే పనులే మానమ్మా -
చిచ్చుబెట్టబాకే చిన్నమ్మా ॥2॥ ॥ముసలమ్మ॥
2.కల్పించిన కథలంటే - చెవికోసుకుంటావమ్మా
చెడుమాటల సభలంటే - నువ్వే ముందుంటామ్మా ॥2॥
విన్నదానికి కోసరూవేసి - వున్నదాన్ని మార్చేసి ॥2॥ కొండాలు చెప్పవద్దమ్మా - జగడాలు పెట్టకు పెద్దమ్మా
॥2॥ ॥ములసమ్మ
3. మంచిగ వున్నోళ్ళని చూస్తే - కళ్ళెర్ర చేస్తావమ్మా హెచ్చింపబడుతూ వుంటే - అపనిందలు వేస్తావమ్మా ॥2॥
వ్యంగ్యపు మాటల కత్తులు దూసి -
చల్లగ గుండెను కోసి ॥2॥
గాయాలు చెయ్యవద్దమ్మా -
నోటికి ఉండాలి హద్దమ్మా ॥2॥ ॥ముసలమ్మ॥
0 Comments