పల్లవి: నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే
నీ దశమ భాగము నీయ వెనుదీతువా
1. ధరలోన ధనధాన్యముల నీయగా - కరుణించి కాపాడి
రక్షింపగా - పరలోక నాధుండు నీకీయగా
మరియేసు కొరకీయ వెనుదీతువా ॥నీ ధనము||
2. పాడిపంటలు ప్రభువు నీకీయగా - కూడు గుడ్డలు నీకు
దయచేయగా - వేడంగ ప్రభుయేసు నామంబును
గడువేల ప్రభుకీయ నో క్రైస్తవా ॥నీ ధనము॥
3. వెలుగునీడలు గాలి వర్షంబులు కలిగించె ప్రభు నీకు
ఉచితంబుగా వెలిగించధరపైని ప్రభునామము
కలిమి కొలది ప్రభువున కర్పింపవా ॥నీ ధనము॥
4. కలిగించే సకలంబు సమృద్ధిగా తొలగించే పలుబాధ
భరితంబులు - బలియాయె నీ పాపముల కేసుడే
చెలువంగ ప్రభుకీయ చింతింతువా॥నీ ధనము॥
5. ఘన సేవ జయమొంద పనిబూనుడీ - వినయంబుతో
మదిని ధ్యానించుడీ - ప్రార్థింప దలవంచి ప్రభు భాగమున్
దేదీప్యముగ నుండ సమకూర్చుడీ॥నీ ధనము॥
6. ప్రధమ ఫలంబులు దేవునివి- ప్రధమంబుగ నీయ
మదినెంచుడీ - ప్రధమ భాగములెల్ల విడదీయుడి
ముదమున దేవుని కర్పించుడీ ॥నీ ధనము॥
7. పరిశుద్ధ దేవుని మందిరమున్ పరిపూర్ణముగా
యోచించుడీ - పరిశుద్ద భాగంబు విడదీయుడి
పరమాత్మ దీవెనలను బొందుడి॥నీ ధనము॥

0 Comments