Advertisement

Responsive Advertisement

88 | Margamu Chupumu | మార్గము చూపుము | Calvary Temple

పల్లవి: మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి 
మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి

1. పాపమమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించె క్షామము 
పశ్చాత్తాపమునొంది తండ్రి క్షమగోరుచు పంపుము క్షేమము 
ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము॥మా॥

2. ధనమే సర్వంబనుచు సుఖమే స్వర్గంబనుచు తండ్రిని వీడితి 
ధరణీ భోగములెల్ల బ్రతుకు ధ్వంసముజేయ దేవా నిన్ చేరితి 
దేహియని నీవైపు చేతులెత్తిన నాకు దారిని జూపుము ॥మా॥

3. దూరదేశములోన బాగుందునను కొనుచు తప్పితి మార్గము 
తరలి పోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమె దారిద్య్రము 
దాక్షిణ్యమూర్తి నీదయ నాపై కురిపించి ధన్యుని జేయుము॥మా॥

4. అమ్ముకొంటిని నన్ను అధముడొకనికి నాదు ఆకలి బాధలో 
అన్యాయమయిపోయె పందులుసహ వెలివేయ అలవడెను వేదన 
అడుగంటె అవనీతి మేల్కొనియె మానవత ఆశ్రయము జూపుము ॥మా॥

5. కొడుకునే కాదనుచు గృహమే చెరసాలనుచు కోపించి వెళ్లితి 
కూలి వానిగనైన నీ యింట పనిచేసి కనికరమే కోరుదు 
కాదనకు నా తండ్రి దిక్కెవ్వరును లేరు క్షమియించి బ్రోవుము॥మా॥

6. నా తండ్రి నను జూచి పరుగిడుచు యేతెంచి నాపైబడి యేడ్చెను 
వజీవమును గూర్చి యింటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను 
నా జీవిత కథయంత యేసుప్రేమకు ధరలో సాక్ష్యమై యుండును ॥మా॥

Post a Comment

0 Comments