Advertisement

Responsive Advertisement

84 | Yehova Na Balama | యెహోవా నా బలమా | Calvary Temple

పల్లవి: యెహోవా నా బలమా - యధార్థమైనది నీ మార్గం 
పరిపూర్ణమైనది నీ మార్గం ॥యెహోవా॥

1. నా శత్రువులు నను చుట్టినను - 
నరకపు పాశము లరికట్టినను 
వరదవలె భక్తిహీనులు పొర్లిన 
విడువక నను యెడబాయని దేవా ॥ యెహోవా॥

2. మరణపు టురులలో మరువక - మొరలిడ 
ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై - 
తన ఆలయములో నా మొరవినెను 
ఆదరెను ధరణి భయకంపముచే ॥యెహోవా॥

3. పౌరుషము గల ప్రభు కోపింపగా 
పర్వతముల పునాదులు వణకెను - 
తన నోట నుండి వచ్చిన యగ్ని 
దహించి వేసెను వైరులనెల్లన్ ॥యెహోవా॥

4. మేఘములపై ఆయన వచ్చును 
మేఘములను తన మాటుగా జేయును 
ఉరుములు మెరుపులు మెండుగ జేసి 
అపజయమిచ్చును అపవాదికిని ॥యెహోవా॥

5. దయగల వారిపై దయ జూపించును - 
కఠినుల యెడల వికటము జూపును - 
గర్విష్టుల యొక్క గర్వమునణచును 
సర్వము నెరిగిన సర్వాధికారి ॥యెహోవా॥

6. నా దీపమును వెలిగించువాడు 
నా చీకటిని వెలుగుగ జేయును 
జలరాసులనుండి బలమైన చేతితో 
వెలుపల జేర్చిన బలమైన దేవుడు ॥యెహోవా॥

7. నా కాళ్ళను లేడి కాళ్ళుగ జేసి - 
ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి 
రక్షణ కేడెము నాకందించి 
అక్షయముగ తన పక్షము జేర్చిన ॥యెహోవా॥

8. యెహోవా జీవముగల దేవా 
బహుగా స్తుతులకు అర్హుడ నీవు - 
అన్యజనులలో ధన్యత జూపుచు 
హల్లెలూయ స్తుతి గానము జేసెద ॥యెహోవా॥

Post a Comment

0 Comments