పల్లవి: రక్షణ పొందితివా - నిరీక్షణ నొందితివా
బ్రతుకిల మారినదా నీ భారం తీరినదా
1. ఎన్నాళ్ళు ఈ పాపపు బ్రతుకు - ఎందాక ఈ శాపపు పరుగు
అంతము మరణమేగా నీ అంతము నరకమేగా ॥రక్షణ॥
2. ఆగదు సమయం నీ రక్షణకై ఆగదు మరణం నీ కోరికపై
అనువగు సమయమిదే - నీ రక్షణ సుదినమిదే ॥రక్షణ॥
3. ఎన్నాళ్ళుగ ప్రభునెదిరించితివో - ఎంతగ ప్రభుని విసిగించితివో
కొంచెము యోచించు నీవించుక గమనించు ॥రక్షణ॥
4. పాపమునుండి తిరుగుము నేడే పాపిని ప్రభువా మన్నించుమనీ
పరితాపము పొంది - ప్రార్థించుము ఈ దినమే ॥రక్షణ॥
5. ప్రేమామయుడు ప్రభువగు క్రీస్తు - ప్రాణముపెట్టెను సిలువలో నీకై
పాపము తొలగించున్ నీ శాపము పరిమార్చున్ ॥రక్షణ॥

0 Comments