పల్లవి: జాలితో ప్రేమతో పిలిచె మంచి కాపరి
1. చెదరి చెడిన గొఱ్ఱనైనే - పడితి పాప కూపమందు
చేరదీసి సేదదీర్చి - చేర్చె శాంతి నగరిలోన (2)
2. మొండి బ్రతుకునందు నేను- బండగానే మారిపోగా
ఖండమొంది సిలువయందు - గుండె కార్చె రుధిర ధార (2)
3. సదయుడైన యేసు రాజు - హృదయశుద్ధి నన్ను గోరె
పదిలమైన పరమ పురము - ఫలముగా నాకియ్య దలచి (2)

0 Comments