పల్లవి: మూడునాళ్ళ ముచ్చటకోసం -
ఈ మనిషి పడే తపన చూడరా...
నీటి బుడగలాంటి జీవితం
ఏనాడు సమసిపోవునో ఎరుగవు
1. మనిషికి తన మనస్సే చెరసాలరా
మమతలు మమకారాలు బంధాలురా
వల్లకాటి వరకేరా బహుబంధాలు
నీ కల్లానికి చేరవురా అనుబంధాలు
కల్లలైన కలలు మానుకో - ఎల్లవేళలా ఆ ప్రభుని వేడుకో
2. ఇంధ్రధనస్సు లాంటిదోయి ఈ సంసారం
అది కనిపించి మాయమౌను రంగుల వలయం
గడ్డిపువ్వు లాంటిదోయి ఇలలో సౌఖ్యం
అది పాపానికి జీతమురా మనిషికి మరణం
నిత్యమైన సుఖం వెదకరా నిరతము ఆ ప్రభుని వేడరా
3. తప్పిదములు చేయువాడు వర్ధిల్లడు
అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా!
జిగటగల ఊబినుండి పైకి లేపి
నీ పాదములు స్థిరముగా నిలుపును ప్రభువే
తీర్పు తీర్చబడక మునుపే నీవు మారుమనసు పొందు సోదరా!
నీ బ్రతుకు మార్చుకో సోదరీ

0 Comments