85.Nakentho Anandham|నా కెంతో ఆనందం|Song Lyrics in Telugu|Hosanna Ministries

పల్లవి : నా కెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా 
నీలో నేనుండుటే అదే నా ధన్యతయే

1.ఏ అపాయము నను సమీపించక 
ఏ రోగమైనను నా దరికి చేరక
నీవు నడువు మార్గములో నా పాదము జారక 
నీ దూతలే నన్ను కాపాడితిరా
|| నా కెంతో ||

2.నా వేదనలో నిన్ను వేడుకొంటిని 
నా రోదనలో నీకు మొఱ్ఱ పెట్టితిని 
నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా 
నా కన్న తండ్రివై కాపాడుచుంటివా || నా కెంతో ||

3.నూతన యెరూషలెం నా గమ్యమైనని 
నా కొరకు నీవు సిద్ధపరచు చుంటివా 
నివుండు స్థలములో నేనుండ గొరేదను 
నా వాంఛ అదియే శ్రీ యేసయ్యా || నా కెంతో ||

Post a Comment

0 Comments