Parugethedhaa|పరుగెత్తెదా| Hosanna Ministries Songs

పల్లవి : పరుగెత్తెదా పరుగెత్తెదా పిలుపుకు తగిన బహుమతికై 
ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరుగెత్తెదా (2)

1.దైవ భయము కలిగి - శరీరేచ్చలను విడిచి (2) 
అక్షయ కిరీటము కొరకే - ఆశతో పరుగెత్తెదా (2) || పరుగెత్తెదా ||

2.ఆత్మాభిషేకము కలిగి - ఆత్మల భారముతో (2) 
అతిశయ కిరీటము కొరకే - అలయక పరుగెత్తెదా (2) || పరుగెత్తెదా ||

3. యేసు వైపు చూచుచు - విశ్వాసము కాపాడుకొనుచు (2) 
వాడబారని కిరీటముకే - వాంఛతో పరుగెత్తెదా (2)
|| పరుగెత్తెదా ||

Post a Comment

0 Comments