Sthuthi Padutake Brathikinchina|స్తుతి పాడుటకే బ్రతకించిన| Song Lyrics

Sthuthi Padutake Brathikinchina Song Lyrics



స్తుతి పాడుటకే బ్రతకించిన – జీవన ధాతవు నీవేనయ్యా
ఇన్నాళ్ళుగ నను పోషించినా – తల్లివలె నను ఓదార్చినా
నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా (2)
జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా – నా జీవితకాలమంతా ఆరాధించి ఘనపరుతును

1.ప్రాణ భయమును తొలగించినావు – 
ప్రాకారములను స్థాపించినావు 
సర్వజనులలో నీ మహిమ వివరింప – 
దీర్ఘాయువుతో నను నింపినావు (2)
నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై-
తలచిన ప్రతి క్షణమున నూతన బలమిచ్చెను    || స్తుతి పాడుటకే ||

2.నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు –
కనుమరుగాయెను నా దుఃఖదినములు
కృపలను పొంది నీ కాడి మోయుటకు – 
లోకములోనుండి ఏర్పరిచినావు (2)
నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై –
నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను    || స్తుతి పాడుటకే ||

3.హేతువు లేకయే ప్రేమించినావు – 
వేడుకగా ఇల నను మార్చినావు
కలవరమొందిన వేళలయందు – 
నా చేయి విడువక నడిపించినావు (2)
నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతి గానమై –
నిలిచిన ప్రతిస్థలమున పారెను సెలయేరులై     || స్తుతి పాడుటకే ||


Post a Comment

0 Comments